ఎంత మంది చెప్పిన తన వైఖరి మార్చుకోనంటున్న విష్ణుప్రియ!
on Nov 27, 2024
బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పుడు ఎంట్రీ ఇచ్చిన పద్నాలగు మంది కంటెస్టెంట్స్ లలో కాస్త కూస్తో విష్ణు ప్రియనే అందరికి సుపరిచితం. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. షోకి ఎంట్రీ ఇచ్చాక తనలోని మరోక కోణం బయటకు వచ్చింది. తన తోటి కంటెస్టెంట్ అయిన పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. గేమ్ లో ఫోకస్ కంటే తనపై ఫోకస్ ఎక్కువ పెడుతుంది విష్ణుప్రియ.
అయితే ఈ విషయన్ని హౌస్ మేట్స్ నామినేట్ చేస్తూ.. నీ గేమ్ నువు అడు, ఎవరికోసమో నువ్వు రాలేదంటూ చెప్పక వచ్చారు. మొన్న జరిగిన ఫ్యామిలీ వీక్ లో విష్ణుప్రియ ఫాదర్ వచ్చాడు. తను కూడా అదే చెప్పాడు. బయట బ్యాడ్ అవుతున్నావమ్మా మార్చుకోమని ఆది అన్నాడు. నాకూ అతనిపై ఫీలింగ్ ఉంది దాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకుంటా.. ఆ ఫీలింగ్ నాది నేను చూపిస్తానంటూ ఎవరు చెప్పినా వినకుండా విష్ణుప్రియ పెడచెవిన పెడుతూ వస్తుంది.
అయితే విష్ణు, పృథ్వీతో క్లోజ్ గా ఉండడంతో పలు ట్రోల్స్ కూడా జరిగాయి. అయితే నిన్న హోస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ అలేఖ్య హారిక, అఖిల్ సార్థక్ లు ఎంట్రీ ఇచ్చారు. నీ గేమ్ చేంజ్ చెయ్యాలని విష్ణుప్రియతో అఖిల్ అంటాడు. తను నా ఆలోచన ప్రేక్షకులకి నేను నచ్చాను కాబట్టి ఇంత దూరం తీసుకొని వచ్చారని విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియపై నీ అభిప్రాయం ఏంటని హారిక పృథ్వీని హారిక అడుగుతుంది. తను నాకు మంచి ఫ్రెండ్ అంతే.. తను చెప్పింది ఈ ఫీలింగ్ ఉందని కానీ నాకు అలా ఏం లేదు. నాకూ నా గోల్ కెరీర్ పై మాత్రమే ఫోకస్ ఉందని క్లారిటీ ఇస్తాడు పృథ్వీ. మరి పృథ్వీ కోసం విష్ణుప్రియ ప్రేక్షకుల దృష్టిలో బకరా కానుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read